China: దాదాపు ఆర్నెల్ల తర్వాత చైనాలో కొవిడ్ మరణం

First covid death in China after six months

  • కరోనాకు పుట్టిల్లుగా నిలిచిన చైనా
  • ప్రపంచవ్యాప్తంగా వణికించిన వైరస్ మహమ్మారి
  • కఠినమైన ఆంక్షలతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసిన చైనా
  • ఇటీవల చైనాలో మళ్లీ పాజిటివ్ కేసులు

కరోనా మహమ్మారి వైరస్ కు పుట్టినిల్లు చైనాలో మళ్లీ పాజిటివ్ కేసులు నమోదమవుతున్నాయి. చైనాలోని పలు ప్రాంతల్లో కఠిన ఆంక్షలతో కూడిన లాక్ డౌన్లు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో, చైనాలో దాదాపు ఆర్నెల్ల తర్వాత మళ్లీ ఓ కొవిడ్ మరణం నమోదైంది. నేడు ఓ అధికారిక ప్రకటనలో చైనా వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 

బీజింగ్ కు చెందిన 87 ఏళ్ల వృద్ధుడు కరోనా బారినపడిన మరణించినట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ నేడు ప్రకటించింది. మే 26 తర్వాత చైనాలో కరోనా మరణం నమోదవడం ఇదే ప్రథమం. ఈ తాజా మరణంతో చైనాలో కరోనా మృతులసంఖ్య 5,227కి పెరిగింది. 

కాగా, చైనాలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరం చేసినప్పటికీ, కొత్త కేసులు నమోదవుతున్నాయి. చైనాలో కనీసం ఒక్క డోసు తీసుకున్నవారు 92 శాతం మంది ఉన్నారు.

  • Loading...

More Telugu News