Charminar: చార్మినార్ వద్ద బాంబు బెదిరింపు కలకలం

Bomb threat call for Charminar
  • చార్మినార్ వద్ద బాంబు పెట్టామంటూ పోలీసులకు ఫోన్ కాల్
  • వెంటనే అప్రమత్తమైన పోలీసులు
  • బాంబు స్క్వాడ్ తో తనిఖీలు
  • లభ్యం కాని బాంబు.. ఫేక్ కాల్ గా నిర్ధారణ
హైదరాబాదులోని చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద బాంబు కలకలం రేగింది. చార్మినార్ వద్ద బాంబు పెట్టామంటూ ఆగంతుకుల నుంచి పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. దాంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. 

చార్మినార్ వద్ద, పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చార్మినార్ చుట్టుపక్కల దుకాణాలు, హోటళ్లలో తనిఖీ చేశారు. 

ఎక్కడా బాంబు లేకపోవడంతో అది ఫేక్ కాల్ అని నిర్ధారించారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అది ఆకతాయిల కాల్ అయ్యుంటుందని భావిస్తున్నారు. చార్మినార్ కు బాంబు బెదిరింపులు ఇదే కొత్త కాదు. గతంలోనూ ఓసారి ఆకతాయిల కాల్ తో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు.
Charminar
Bomb Threat
Police
Fake Call
Hyderabad

More Telugu News