TTD: ఈ నెల 24న దివ్యాంగులు, వృద్ధులకు దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
- ఉదయం 10 గంటలకు ఆన్ లైన్లో టికెట్లు
- అధికారిక వెబ్ సైట్లో బుక్ చేసుకోవాలన్న టీటీడీ
- నకిలీ వెబ్ సైట్లతో జాగ్రత్త అంటూ హెచ్చరిక
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే దివ్యాంగులు, ఐదేళ్ల లోపు పసిబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీటీడీ ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టికెట్లను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
భక్తులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ టికెట్లను పొందవచ్చని తెలిపింది. నకిలీ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేసింది. కాగా, ప్రతి నెలలోనూ రెండు రోజులు దివ్యాంగులు, ఐదేళ్ల లోపు పసిబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీటీడీ తిరుమల వెంకన్న దర్శన భాగ్యం కలుగజేస్తోంది.