Sensex: వరుసగా రెండో రోజు లాభపడ్డ స్టాక్ మార్కెట్లు
- 92 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 23 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఇన్వెస్టర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 92 పాయింట్లు లాభపడి 61,510కి చేరుకుంది. నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 18,267 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.44%), బజాజ్ ఫైనాన్స్ (1.41%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.31%), కోటక్ బ్యాంక్ (0.85%), సన్ ఫార్మా (0.76%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.24%), టెక్ మహీంద్రా (-0.66%), భారతి ఎయిర్ టెల్ (-0.54%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.50%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.48%).