FDA: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం ఇదే.. ధర రూ. 28.6 కోట్లు మాత్రమే!

FDA grants approval for CSLs haemophilia B gene therapy

  • రక్తం గడ్డకట్టడం వల్ల కాలేయంలో సమస్యలు
  • ‘హిమోఫిలియో బి’ ఔషధాన్ని తీసుకొచ్చిన సీఎస్ఎల్ లిమిటెడ్
  • ఆమోద ముద్ర వేసిన అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ
  • హీమోజెనిక్స్  పేరుతో అమెరికాలో విక్రయం

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం ఒకటి మార్కెట్లోకి వచ్చింది. ‘హిమోఫిలియా బి’ అనే సమస్యకు సంబంధించిన అత్యంత ఖరీదైన ఔషధం ఇదే.  సీఎస్ఎల్ లిమిటెడ్ దీనిని తయారుచేసింది. ఆస్ట్రేలియాలో దీని ధరను 3.5 మిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 28.6 కోట్లు. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ దీనికి ఆమోదముద్ర వేసింది. దీంతో హీమోజెనిక్స్ పేరుతో అమెరికాలో ఈ ఔషధాన్ని విక్రయిస్తారు. 

రక్తం గడ్డ కట్టడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలతో కూడిన అరుదైన ఈ లోపానికి అందుబాటులోకి వచ్చిన తొలి జన్యుపరమైన చికిత్స ఇదే.  ప్రతి 40 వేల మందిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు.  ఈ సమస్య నివారణకు పలు సంస్థలు చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ వాటితో పోలిస్తే తాజాగా అందుబాటులోకి వచ్చిన చికిత్స దీర్ఘకాలంపాటు ప్రభావవంతంగా ఉంటుంది. ‘హిమోఫిలియో బి’ సమస్యకు ప్రస్తుతం రెండు ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకదాని ఖరీదు 2.8 మిలియన్ డాలర్లు కాగా, రెండో దాని ఖరీదు 3 మిలియన్ డాలర్లు. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన ఔషధం ధర 3.5 మిలియన్ డాలర్లు.

కాలేయంలో ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టర్-9 (ix) అనే ప్రొటీన్ లోపం కారణంగా ‘హిమోఫిలియా బి’ అనే సమస్య వస్తుంది. తాము తీసుకొచ్చిన చికిత్సలో జన్యుపరంగా మార్పులు చేసిన వైరస్ ఒక ప్రత్యేకమైన జన్యు పదార్థాన్ని లివర్‌లో ప్రవేశపెడుతుందని, అప్పడు కాలేయం నుంచి ఫ్యాక్టర్-9(ix) విడుదలవుతుందని దాని తయారీ సంస్థ పేర్కొంది.

  • Loading...

More Telugu News