Elon Musk: త్వరలో ట్విట్టర్ లోకి కంగనా రనౌత్.. నిషేధిత ఖాతాల పునరుద్ధరణ

Elon Musk proposes Twitter may lift ban on almost all suspended accounts soon
  • దీనిపై ట్విట్టర్ లో పోల్ చేపట్టిన ఎలాన్ మస్క్
  • మెజారిటీ యూజర్లు ఓకే అంటే చాలు
  • నిలిచిపోయిన ఖాతాలన్నీ తిరిగి యాక్టివ్ లోకి
ట్విట్టర్ లోకి ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తిరిగి వచ్చే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. గతంలో వివాదాస్పద పోస్ట్ లతో ట్విట్టర్ నిబంధనలు ఉల్లంఘించడంతో కంగనా ఖాతా నిలిచిపోయింది. దీంతో ఆమె ఇన్ స్టా గ్రామ్ కే పరిమితమైంది. ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోలు తప్ప ఏమీ లేదని.. అదొక మూగ ప్లాట్ ఫామ్ అంటూ ఆమె ఇటీవలే విమర్శించింది. ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లడంతో, తిరిగి ట్విట్టర్ లోకి రావాలని అనుకుంటున్నట్టు చెప్పింది. ఆమె కోరిక నెరవేరే రోజు రానుంది. 

ట్విట్టర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతా కూడా నిలిచిపోవడం తెలిసిందే. ట్విట్టర్ పై పోల్ పెట్టి మరీ, మెజారిటీ అభిప్రాయం మేరకు ట్రంప్ ఖాతాను ఎలాన్ మస్క్ పునరుద్ధరించారు. అయినా, తనకు తిరిగి ట్విట్టర్ లోకి వచ్చే ఆసక్తి లేదని ట్రంప్ ప్రకటించారు. ఇదే మాదిరి ట్విట్టర్ లో నిలిచిపోయిన ఖాతాలు అన్నింటినీ పునరుద్ధరించేందుకు మస్క్ సుముఖంగా ఉన్నారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో పోల్ పెట్టి యూజర్ల అభిప్రాయం కోరారు. మెజారిటీ యూజర్లు ఓకే అంటే చాలు.. బ్యాన్ అయిన ట్విట్టర్ ఖాతాలన్నీ మళ్లీ యాక్టివ్ గా మారనున్నాయి. 

Elon Musk
twitter
Kangana Ranaut
lift ban
accounts

More Telugu News