Ch Malla Reddy: పార్ట్ 1 మాత్రమే అయింది.. పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంటాయి.. వేధిస్తూనే ఉంటారు: మల్లారెడ్డి

IT official will us for 3 months says Malla Reddy
  • మేమంతా పనులన్నీ మానుకుని రోజూ ఐటీ ఆఫీస్ కు వెళ్లాల్సి ఉంటుందన్న మల్లారెడ్డి
  • మూడు నెలల పాటు వేధిస్తూనే ఉంటారని వ్యాఖ్య
  • టార్చర్ పెడతారన్న మల్లారెడ్డి
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు తమ ముందు విచారణకు హాజరుకావాలని మల్లారెడ్డికి, ఆయన ఇద్దరు కుమారులకు, అల్లుడికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై మల్లారెడ్డి స్పందిస్తూ... నోటీసులు జారీ చేయడం సాధారణ విషయమేనని చెప్పారు. ఇంకా చాలా ఉంటుందని, మూడు నెలలపాటు మమ్మల్ని రోజూ వేధిస్తూనే ఉంటారని అన్నారు. ఇప్పటి వరకు అయింది కేవలం రెయిడ్ మాత్రమేనని.... అంటే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు అని తెలిపారు. 

ఇప్పటి వరకు పార్ట్ 1 మాత్రమే అయిందని.. ఇంకా పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంటాయని మల్లారెడ్డి చెప్పారు. తాను, తన కొడుకులు, అల్లుడు, తమ ప్రిన్సిపాళ్లు అందరూ రోజూ అన్ని పనులు, వ్యాపారాలు వదిలేసుకుని ఐటీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. ఇంచి ఇంచి లెక్కపెట్టి అన్నీ తీస్తారని చెప్పారు. తమను రోజూ వేధిస్తూనే ఉంటారని చెప్పారు. ఐటీ కార్యాలయానికి తామంతా క్యూ కట్టాల్సి ఉంటుందని అన్నారు. టార్చర్ పెడతారని చెప్పారు. మీకు కూడా ఆయకర్ భవన్ వద్ద రోజూ పని ఉంటుందని మీడియాను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. విచారణకు ఎవరెవరు వచ్చారు? ఏం జరుగుతోంది? అంటూ రోజూ రిపోర్టింగ్ చేస్తారని సరదా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి రెయిడ్లు ఉండవని... వేరే రాష్ట్రాల్లోనే రెయిడ్లు ఉంటాయని చెప్పారు.
Ch Malla Reddy
TRS
IT Raids

More Telugu News