Raghu Rama Krishna Raju: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు.. విచారణకు రావాలంటూ రఘురామకృష్ణరాజుకు నోటీసులు

SIT notices to Raghu Rama Krishna Raju in TRS MLAs poaching case
  • ఎమ్మెల్యేలకు ఎర కేసులో సరికొత్త ట్విస్ట్
  • 41ఏ సీఆర్పీసీ కింద రఘురాజుకు నోటీసులు
  • ఈ నెల 29న విచారణకు రావాలని ఆదేశం
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో సరికొత్త ట్విస్ట్ నెలకొంది. ఈ కేసు విచారణకు హాజరుకావాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29న బంజారాహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. మరోవైపు ఈ కేసు విచారణలో రఘురాజుకు సంబంధించి కీలక విషయాలను సిట్ సేకరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. 

ఈ కేసులో ఇప్పటికే రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ లను సిట్ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపింది. ఆ తర్వాత బీజేపీ నేత బీఎల్ సంతోష్, భారతీయ ధర్మ జనసేన చీఫ్ తుషార్, కేరళ వైద్యుడు జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్ లకు నోటీసులు జారీ చేసింది. అనంతరం నందకుమార్ భార్య చిత్రలేఖ, న్యాయవాది ప్రతాప్ కుమార్ లకు నోటీసులు ఇచ్చింది. తాజాగా రఘురాజుకు నోటీసులు జారీ చేసింది.
Raghu Rama Krishna Raju
YSRCP
TRS
Telangana
SIT

More Telugu News