CPI Narayana: దర్యాప్తు సంస్థలు ఎక్కడ దాడులు చేపట్టినా లైవ్ లో చూపించాలి: సీపీఐ నారాయణ

CPI Narayana demands live telecast of probe agencies raids

  • ఈడీ, ఐటీ, సీబీఐ దాడులపై నారాయణ స్పందన
  • బీజేపీ వచ్చాక దాడులు పెరిగాయని ఆరోపణ
  • లైవ్ లో చూపిస్తే వాస్తవాలు అందరికీ తెలుస్తాయని వెల్లడి
  • లేకపోతే కక్షసాధింపు అనుకోవాల్సి వస్తుందని స్పష్టీకరణ

ఈడీ, ఐటీ, సీబీఐ దాడులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎక్కడ దాడులు చేపట్టి అవినీతిని వెలికి తీసే ప్రయత్నం చేసినా, అక్కడ లైవ్ పెట్టాలని కోరుతున్నామని తెలిపారు. సోదాలు చేసే సమయంలో ఏం జరుగుతోందో లైవ్ ద్వారా అందరికీ తెలుస్తుందని అన్నారు. 

"నేనీ మాట ఎందుకు అంటున్నానంటే... బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని వ్యతిరేకించే పార్టీల పైనా, వ్యాపార సంస్థలపైనా ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. దాడులు చేసిన తర్వాత ఢిల్లీకి వచ్చి మాట్లాడుకోండి అని చెప్పి వెళ్లిపోతున్నారు. 

అధికారుల వద్దే కెమెరాలు ఉంటాయి కాబట్టి సోదాలు లైవ్ లో చూపించాలి. అక్కడే ఏం జరిగిందో లైవ్ లోనే ప్రకటించవచ్చు. లైవ్ లో చూపించకపోతే మాత్రం అది కక్ష సాధింపు చర్యల కిందే భావించాల్సి ఉంటుంది" అని నారాయణ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News