Telangana Assembly Sessions: డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు... సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana assembly winter sessions will be held in December
  • డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
  • ఏర్పాట్లు చేయాలని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీశ్ రావులకు ఆదేశం
  • కేంద్రం చర్యలను ప్రజలకు వివరించాలన్న సీఎం 
  • రూ.40 వేల కోట్ల ఆదాయం తగ్గిందన్న కేసీఆర్
  • కేంద్రం వల్లేనని ఆరోపణ
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబరులో జరగనున్నాయి. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీశ్ రావులను ఆదేశించారు. 

తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. కేంద్రం ఆంక్షల వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని సీఎం కేసీఆర్ వివరించారు. కేంద్రం చర్యలను అసెంబ్లీ ద్వారా ప్రజలకు వివరించాలని, తెలంగాణ ప్రగతికి కేంద్రం ఎలా అడ్డుతగులుతోందో అందరికీ తెలియజేయాలని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై సమావేశాల్లో చర్చిద్దామని తెలిపారు.
Telangana Assembly Sessions
CM KCR
TRS
Telangana

More Telugu News