Kiran Kumar Reddy: అన్ స్టాపబుల్-2 తాజా ఎపిసోడ్ లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర అంశాల వెల్లడి

Former CM Kiran Kumar Reddy attends Unstoppable 2 latest episode
  • బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్-2
  • తాజా ఎపిసోడ్ కు కిరణ్ కుమార్ రెడ్డి, సురేశ్ రెడ్డి, రాధిక హాజరు
  • వైఎస్ హెలికాప్టర్ ఘటన ముందు పరిస్థితులు వివరించిన కిరణ్
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్-2 ఓటీటీ షో లేటెస్ట్ ఎపిసోడ్ కు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి, సినీ నటి రాధిక హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర అంశాలు వెల్లడించారు. 

నాడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అంశాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో తాను కూడా అదే హెలికాప్టర్ లో వెళ్లాల్సి ఉందని, కానీ ఆ సమయంలో అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న తాను పలు కమిటీల నియామకాలతో బిజీగా ఉన్నందున వెళ్లలేకపోయానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. 

అసెంబ్లీ ముగింపు వేళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఫోన్ చేశారని, అకౌంట్స్ కమిటీకి శోభా నాగిరెడ్డి పేరును సూచించారని గుర్తు చేసుకున్నారు. మరుసటి రోజు వివిధ సభా సంఘాల ప్రకటన చేయాల్సి ఉండడంతో వైఎస్ తో ఆ హెలికాప్టర్ లో వెళ్లలేకపోయానని వివరించారు. ఆ రోజున హెలికాప్టర్ లో వెళ్లకపోవడంతో బతికానని, బతికుండబట్టే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యానని కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు.
Kiran Kumar Reddy
Unstoppable
Latest Episode
YSR
Andhra Pradesh

More Telugu News