China: చైనాలోని అతిపెద్ద పిగ్ సెంటర్ పై నిపుణుల ఆందోళన

Experts warn of increased risk of disease outbreaks as China builds 26storey pig palace

  • హూబే ప్రావిన్స్ లో 6,50,000 పందులను పెంచే కేంద్రం
  • ఏడాదికి 10 లక్షల పందులను వధించే ఏర్పాట్లు
  • జంతు వ్యాధులు ప్రబలుతాయంటున్న నిపుణులు

చైనా ఏం చేసినా అది అతిగానే ఉంటుంది. కరోనా మహమ్మారి పుట్టుక కేంద్రమైన చైనా.. ఆ వైరస్ రూపంలో ప్రపంచంలో కోట్లాది మంది ప్రాణాలు పోవడానికి కారణమని తెలిసిందే. ఇప్పుడు సెంట్రల్ హూబీ ప్రావిన్స్ పరిధిలోని ఈజూ పట్టణం శివారులో అతిపెద్ద పందుల పెంపకం కేంద్రాన్ని అక్కడి సర్కారు ఏర్పాటు చేసింది. 26 అంతస్తుల్లో 6,50,000 పందులను ఇక్కడ పెంచనుంది. అంతేకాదు, ఒక ఏడాదిలో పది లక్షల పందులను ఇక్కడ సంహరించే ఏర్పాట్లు చేసింది. చైనీయులు పంది మాంసాన్ని చాలా ఇష్టంగా తింటుంటారు. దీంతో డిమాండ్ భారీగా ఉంది.

కానీ, చైనా చేసిన ఈ పనిపై నిపుణులు ఆందోళన చెందుతున్నారు. జంతు వ్యాధులు ప్రబలిపోతాయన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వెలువడే వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారీ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఒక స్విచ్ నొక్కితే ఒకేసారి 30,000 పందులకు ఆహారం అందుతుంది. ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తయ్యే పంది మాంసంలో సగం చైనానే వినియోగిస్తుంటుంది. ప్రమాదకరమైన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కారణంగా చైనాలో 2018 నుంచి 2020 మధ్య 10కోట్ల పందులు చనిపోయాయి. దీంతో పందుల ఉత్పత్తి పెంచాలన్న లక్ష్యంతో చైనా సర్కారు ఈ అతిపెద్ద పందుల కేంద్రాన్ని నిర్మించింది.

  • Loading...

More Telugu News