jio platforms: షార్ట్ వీడియోల కోసం జియో నుంచి కొత్త యాప్

Jio introduces Platfom short video app like Instagram reels

  • ఇన్ స్టా గ్రామ్ రీల్స్ మాదిరే
  • మొదట 100 మందికి ప్రవేశం
  • తర్వాత ఇన్విటేషన్ రూపంలో ఇతరులకు ఆహ్వానం
  • బీటా వెర్షన్ విడుదల

రిలయన్స్ కు చెందిన జియో ప్లాట్ ఫామ్స్ షార్ట్ వీడియో యాప్ ను అభివృద్ధి చేసింది. రోలింగ్ స్టోన్ ఇండియా, క్రియేటివ్ లాండ్ ఏషియా సహకారంతో దీన్ని రూపొందించింది. యూజర్లకు మెరుగైన అనుభవం, క్రియేటర్లకు మెరుగైన ఆదాయం తెచ్చిపెట్టేలా దీన్ని తీర్చిదిద్దాలన్నది సంస్థ ఆలోచనగా ఉంది. ‘‘వినోదాన్ని అందించే స్టార్స్ కు ఇదొక అంతిమ గమ్యం అవుతుంది. గాయకులు, సంగీతకారులు, నటులు, హాస్య నటులు, డ్యాన్సర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, సంస్కృతిని ప్రభావితం చేసే సృష్టికర్తలు అందరికీ ఇది గమ్యస్థానం’’ అని జియో ప్లాట్ ఫామ్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఇన్ స్టా గ్రామ్ రీల్స్ మాదిరే ఇది కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం జియో షార్ట్ వీడియో యాప్ బీటా (పరీక్షల దశలో) వెర్షన్ బయటకు వచ్చింది. పూర్తి స్థాయి వెర్షన్ 2023 జనవరిలో విడుదల కానుంది. అప్పుడు యూజర్లు దీన్ని డౌన్ లోడ్ చేసుకోగలరు. కాకపోతే, ఆరంభంలో అందరికీ ఈ అవకాశం ఉండదని తెలుస్తోంది. వ్యవస్థాపక సభ్యులు మొదటి 100 మంది ఈ యాప్ ను ఉపయోగించుకోగలరు. ఇన్వైట్ విధానంలో ఇతరులను ఈ వేదికపైకి ఆహ్వానించొచ్చు. రిఫరల్ ప్రోగ్రామ్ రూపంలో ఇందులో ప్రవేశం లభిస్తుంది.

  • Loading...

More Telugu News