Sensex: ఆల్ టైమ్ రికార్డ్ హైలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits

  • క్రూడాయిల్ ధరలు తగ్గడంతో మార్కెట్లలో జోష్
  • 211 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 50 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని దూకుడుగా ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయల్ ధరలు తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. దీంతో వారు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మార్కెట్లు దూసుకుపోయాయి. అయితే చివర్లో లాభాల స్వీకరణకు దిగడంతో లాభాలు కొంత మేర తగ్గాయి. ఈ క్రమంలో మార్కెట్లు ఆల్ టైమ్ హైలో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 211 పాయింట్లు లాభపడి 62,505కి పెరిగింది. నిఫ్టీ 50 పాయింట్లు పుంజుకుని 18,563కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ (3.48%), నెస్లే ఇండియా (1.41%), ఏసియన్ పెయింట్స్ (1.38%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.22%), విప్రో (0.76%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-1.22%), భారతి ఎయిర్ టెల్ (-1.10%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.08%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.85%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.79%).

  • Loading...

More Telugu News