Komatireddy Raj Gopal Reddy: కర్ణాటకతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Telangana assembly elections will be held along with Karnataka says Komatireddy
  • కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందన్న రాజగోపాల్ రెడ్డి
  • అధికార దుర్వినియోగంతో మునుగోడులో టీఆర్ఎస్ గెలిచిందని విమర్శ
  • రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని... కర్ణాటకతో పాటే తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికార దుర్వినియోగంతోనే మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి వస్తున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు బీజేపీలోకి రావాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవబోయేది బీజేపీనే అని చెప్పారు.
Komatireddy Raj Gopal Reddy
BJP
KCR
TRS
Congress
Elections

More Telugu News