AIIMS: ఢిల్లీలోని ఎయిమ్స్ కంప్యూటర్లపై హ్యాకర్ల దాడి... రూ.200 కోట్ల క్రిప్టోకరెన్సీ చెల్లించాలని డిమాండ్

Ransomware attack on Delhi AIIMS servers

  • హ్యాకింగ్ జరిగినట్టు బుధవారం  గుర్తించిన ఎయిమ్స్ సిబ్బంది
  • వరుసగా ఆరో రోజు పనిచేయని సర్వర్లు
  • కీలక విభాగాల్లో కంప్యూటర్లు లేకుండానే సేవలు
  • విచారణ జరుపుతున్న కేంద్రం, ఢిల్లీ పోలీసులు

కంప్యూటర్లలో ప్రమాదకర వైరస్ (రాన్సమ్ వేర్) ను చొప్పించి, ఆ కంప్యూటర్లను పనిచేయకుండా చేయడం, పెద్ద మొత్తంలో చెల్లిస్తేనే ఆ కంప్యూటర్లను తిరిగి పనిచేసేలా చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది హ్యాకర్లు కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు.

ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ ఎయిమ్స్ కూడా రాన్సమ్ వేర్ బారినపడింది. వరుసగా ఆరో రోజు కూడా ఎయిమ్స్ లోని సర్వర్లు తెరుచుకోలేదు. తమకు రూ.200 కోట్ల క్రిప్టోకరెన్సీ చెల్లిస్తేనే సర్వర్లను తిరిగి పనిచేసేలా చేస్తామని హ్యాకర్లు స్పష్టం చేశారు. 

ఎయిమ్స్ కంప్యూటర్లు హ్యాకింగ్ కు గురైనట్టు గత బుధవారం గుర్తించారు. దాదాపు 4 కోట్ల మంది రోగుల వివరాలు ఇప్పుడు హ్యాకర్ల చేతిలో ఉండడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సర్వర్లు పనిచేయకపోవడంతో, ఎమర్జెన్సీ విభాగంలోని రోగుల సేవలు, ఓపీ సేలు, ఇన్ పేషెంట్ సేవలు, ల్యాబ్ కార్యకలాపాలన్నీ కంప్యూటర్ల సాయం లేకుండా మామూలు పద్ధతిలో నిర్వర్తిస్తున్నారు. 

కాగా, ఈ రాన్సమ్ వేర్ అటాక్ పై ది ఇండియా కంప్యూర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్), ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధులు విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News