India: చైనా సరిహద్దుల్లో భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు
- 18వ ఎడిషన్ సాయుధ దళాల సంయుక్త శిక్షణా విన్యాసాలు
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఔలి ప్రాంతంలో నిర్వహణ
- శునకాల సేవలు సైతం వినియోగం
భారత్, అమెరికా 18వ ఎడిషన్ సాయుధ దళాల సంయుక్త శిక్షణా విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఔలి ప్రాంతంలో, చైనా సరిహద్దులకు సమీపంలో ఇవి జరుగుతుండడంతో ప్రాధాన్యం నెలకొంది. దీన్ని యుద్ధ అభ్యాస్ గా అభివర్ణిస్తున్నారు. ఇరు దేశాల సైనికులు సంయుక్తంగా విన్యాసాలు చేస్తుండడం ఏటా జరుగుతున్నదే.