Roja: పాయకరావుపేట, కొవ్వూరు ప్రజలు అనితను ఛీత్కరించారు: మంత్రి రోజా

Minister RK Roja replies to TDP leader Anitha remarks
  • అనిత వ్యాఖ్యలకు రోజా కౌంటర్
  • ప్రజలు అనితను తిప్పికొట్టారని విమర్శలు
  • తాను 12 ఏళ్లుగా నగరిలోనే ఉంటున్నానని వెల్లడి
  • ప్రజలు తనను ఆదరిస్తున్నారని వ్యాఖ్యలు
టీడీపీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత తనపై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి రోజా స్పందించారు. పాయకరావుపేట, కొవ్వూరు ప్రజలు అనితను ఛీత్కరించుకున్నారని, ఆమెను తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. తాను గత 12 ఏళ్ల నుంచి నగరిలోనే ఉంటున్నానని, నగరి అభివృద్ధి కోసం పాటుపడుతున్నానని తెలిపారు. అందుకే నగరి ప్రజలు తనను విశ్వసిస్తున్నారని రోజా అన్నారు.  

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తుండగా ఏపీ ప్రగతిపథంలో ముందుకెళుతోందని అన్నారు. ఏపీని జగన్ తీర్చిదిద్దుతున్న విధానాన్ని చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా అచ్చెరువొందుతున్నారని రోజా వివరించారు.
Roja
Anitha
Nagari
YSRCP
TDP

More Telugu News