Sensex: స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న జోరు.. సరికొత్త రికార్డులకు సెన్సెక్స్

Markets ends in profits

  • 177 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 55 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 4 శాతానికి పైగా పెరిగిన హిందుస్థాన్ యూనిలీవర్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. సూచీలు ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేస్తున్నాయి. వెల్లువెత్తుతున్న విదేశీ ఇన్వెస్ట్ మెంట్లతో పాటు, కీలక వడ్డీ రేట్లను అమెరికా ఫెడ్ రిజర్వ్ తగ్గిస్తుందనే అంచనాలతో మార్కెట్లలో జోష్ నెలకొంది. ఈ క్రమంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 177 పాయింట్లు లాభపడి 62,682కి పెరిగింది. నిఫ్టీ 55 పాయింట్లు పుంజుకుని 18,618 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (4.27%), సన్ ఫార్మా (1.46%), నెస్లే ఇండియా (1.32%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.16%), టాటా స్టీల్ (1.14%). 

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.50%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.27%), మారుతి (-0.98%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.97%), ఎల్ అండ్ టీ (-0.70%).

  • Loading...

More Telugu News