Team India: మూడో వన్డేలో కుప్పకూలిన భారత్

 India fold up for 219 in third odi

  • 219 పరుగులకే ఆలౌటైన ధవన్ సేన
  • ఆదుకున్న సుందర్, శ్రేయస్ అయ్యర్
  • నిరాశ పరిచిన పంత్, హుడా, సూర్య, గిల్

న్యూజిలాండ్ తో మూడో వన్డేలో భారత్ బ్యాటింగ్ లో నిరాశ పరిచింది. ప్రత్యర్థి ముంగిట చిన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ శిఖర్ ధవన్ (28) మంచి ఆరంభం ఇచ్చే ప్రయత్నం చేసినా.. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ (13) నిరాశ పరిచాడు. మూడో నంబర్ లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (49) సత్తా చాటాడు. కానీ, రిషబ్ పంత్ (10), ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ (6)తో పాటు దీపక్ హుడా (6) పూర్తిగా విఫలం అయ్యారు. దాంతో, 170 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన భారత్ 200ల్లోపే ఆలౌటయ్యేలా కనిపించింది.

ఈ దశలో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (64 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 51) కీలక హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. టెయిలెండర్లు దీపక్ చహర్ (12), యుజ్వేంద్ర చహల్ (8), అర్ష్ దీప్ సింగ్ (9) తో కలిసి జట్టుకు విలువైన పరుగులు అందించాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత చివరి వికెట్ గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్ చెరో మూడు వికెట్లతో భారత్ ను దెబ్బకొట్టారు. టిమ్ సౌథీ రెండు వికెట్లు తీశాడు.

  • Loading...

More Telugu News