Kothapalli Prabhakar Reddy: ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కావడం మన దురదృష్టం: టీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి

Kothapalli Prabhakar Reddy fires on Raghunandan Rao
  • భుంపల్లి మండలం ఆయన వల్లే వచ్చిందని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారన్న ప్రభాకర్ రెడ్డి
  • హైవేలు కూడా ఆయనే తెచ్చినట్టు చెప్పుకుంటున్నారని మండిపాటు
  • అబద్ధాల యూనివర్శిటీకి ఆయనే వైస్ ఛాన్సలర్ అని ఎద్దేవా
బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే బాధ ప్రజల్లో ఉందని... ఒక దరిద్రుడు ఇక్కడ ఎమ్మెల్యే కావడమే మన దురదృష్టమని మండిపడ్డారు. తన వల్లే భుంపల్లి మండలం వచ్చిందని సిగ్గు, శరం లేకుండా రఘునందన్ రావు చెప్పుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది చేసినా తానే చేసినట్టు చెప్పుకుంటున్నారని... నేషనల్ హైవేలు కూడా తానే తెచ్చినట్టు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. 

నేషనల్ హైవేలకు, ఎమ్మెల్యేలకు ఏమైనా సంబంధం ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. అబద్ధాల యూనివర్శిటీ ఉంటే దానికి రఘునందన్ వైస్ ఛాన్సలర్ అవుతారని ఎద్దేవా చేశారు. మొన్న ఉప ఎన్నికలో ఏదో పొరపాటు జరిగి ఆయన గెలిచారని... మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా మనం చూసుకోవాలని అన్నారు.
Kothapalli Prabhakar Reddy
TRS
Raghunandan Rao
BJP

More Telugu News