K Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు

TRS MLC Kavitha name in Delhi liquor scam ED remand report
  • అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
  • రూ. 100 కోట్లను చెల్లించిన సౌత్ గ్రూప్
  • సౌత్ గ్రూప్ ను నియంత్రించిన శరత్ రెడ్డి, కవిత, మాగుంట
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తావించారు. 32 పేజీల రిమాండ్ రిపోర్టులో కవిత పేరు మూడు సార్లు ప్రస్తావనకు వచ్చింది. రిమాండ్ రిపోర్టు ప్రకారం రూ. 100 కోట్ల ముడుపులను సౌత్ గ్రూప్ చెల్లించింది. ఈ సౌత్ గ్రూప్ ను కవిత, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ రెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట నియంత్రించారు. సౌత్ గ్రూప్ ద్వారా రూ. 100 కోట్లను విజయ్ నాయర్ కు చేర్చారు. విచారణ సందర్భంగా ఇచ్చిన వాంగ్మూలంలో అమిత్ అరోరా వీటిని ధ్రువీకరించారు. 

ఈ వ్యవహారంలో కార్యకలాపాలకు కవిత ఉపయోగించిన 10 సెల్ ఫోన్లను ధ్వంసం చేసినట్టు రిమాండ్ రిపోర్టులో ఉంది. సాక్ష్యాలను ధ్వంసం చేసినట్టు  గుర్తించినట్లు ఈడీ పేర్కొంది. ఈ కేసులో 36 మంది రూ. 1.38 కోట్ల విలువైన 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని తెలిపింది. వీటిలో రెండు నంబర్లతో 10 ఫోన్లను కవిత వాడారని పేర్కొంది.
K Kavitha
TRS
Delhi Liquor Scam
Enforcement Directorate
Remand Report

More Telugu News