K Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ప్రెస్‌మీట్

Delhi Liquor Scam accused TRS MLC Kavitha coming in front of press meet
  • అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు
  • ప్రెస్‌మీట్‌లో వివరణ ఇవ్వనున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ
  • ఆమె ఇంటికి చేరుకుంటున్న టీఆర్ఎస్ కార్యకర్తలు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురి పేర్లను అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలపై బహిరంగంగా స్పందించాలని నిర్ణయించిన కవిత కాసేపట్లో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో జరగనున్న ఈ ప్రెస్‌మీట్‌లో మద్యం కుంభకోణంలో తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో మొత్తం 36 మంది పేర్లను ఈడీ పేర్కొంది. ఇందులో ఎమ్మెల్సీ కవిత సహా శరత్‌రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్, సృజన్‌రెడ్డి పేర్లు ఉన్నాయి. కవిత ప్రెస్‌మీట్ నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున ఆమె ఇంటికి చేరుకుంటున్నారు.
K Kavitha
TRS
Delhi Liquor Scam

More Telugu News