Harish Rao: తెలంగాణలో బీజేపీ బాణాలు, పార్టీలు నడవవు: హరీశ్ రావు

BJP tricks will not works in Telangana says Harish Rao
  • ఎన్నికల ముందు బీజేపీ ఈడీ, ఐటీల దాడులు సహజమేనన్న హరీశ్ 
  • బీజేపీ రాజకీయాలు అందరికీ తెలుసని ఎద్దేవా
  • తెలంగాణలో బీజేపీ కుట్రలు నడవవని వ్యాఖ్య
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్డులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు రావడం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, బీజేపీ రాజకీయాలు దేశంలో అందరికీ తెలుసని... ఎన్నికలు వస్తున్నాయంటే ఈడీలు, ఐటీలతో ఆ పార్టీ దాడులు చేయించడం సహజమేనని అన్నారు. 

అంతేకాదు బీజేపీ వదిలే బాణాలు, పెట్టించే పార్టీలు కూడా ఉంటాయని పరోక్షంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై విమర్శలు గుప్పించారు. బీహార్, యూపీలాంటి రాష్ట్రాల్లో అయితే బీజేపీ బాణాలు, పార్టీలు, కుట్రలు నడుస్తాయని.. ఉద్యమాల గడ్డ తెలంగాణలో అవి నడవవని అన్నారు. కవితతో కలిసి హరీశ్ రావు జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ నెల 7న జరిగే కేసీఆర్ బహిరంగసభకు సంబంధించిన ఏర్పాట్లను వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Harish Rao
K Kavitha
TRS
BJP

More Telugu News