Kerala: ప్రకటనలో చెప్పిన దానికి, వాస్తవ మైలేజీకి పొంతన లేదంటూ కోర్టుకెక్కిన మహిళ.. రూ. 3 లక్షల పరిహారం

 Kerala Consumer Court awards Rs 3 lakh compensation to Ford car owner

  • 2014లో రూ. 9 లక్షలతో ఫోర్డ్ క్లాసిక్ కారు కొనుగోలు చేసిన కేరళ మహిళ
  • లీటరుకు 32 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని ప్రకటన
  • 19.6 కిలోమీటర్ల మైలేజీ మాత్రమే రావడంతో కోర్టును ఆశ్రయించిన వైనం
  • అనుకూలంగా కోర్టు తీర్పు

ప్రకటనలో చెప్పిన మైలేజీకి, వాస్తవ మైలేజీకి పొంతన లేదంటూ ఓ కారు కంపెనీపై కోర్టుకెక్కిన మహిళ విజయం సాధించింది. ఆమెకు 3 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని సదరు కారు కంపెనీని కోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని త్రిసూర్ జిల్లాకు చెందిన సౌదామిని 2014లో రూ. 9 లక్షలతో ఫోర్డ్ క్లాసిక్ (డీజిల్) కారు కొనుగోలు చేశారు. 

ఈ కారు మైలేజీ చాలా తక్కువగా ఉందని, ప్రకటనలో పేర్కొన్న దానికి, దాని వాస్తవ మైలేజీకి పొంతనే లేదంటూ ఆమె వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు ఆమె ఆరోపణలను నిర్ధారించింది. ప్రకటనలో ఆ కంపెనీ లీటరుకు 32 కిలోమీటర్లు ఇస్తుందని పేర్కొనగా, వాస్తవానికి అది 19.6 కిలోమీటర్లే ఇస్తున్నట్టు తేలడంతో బాధితురాలికి అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. సౌదామినికి రూ. 3 లక్షల పరిహారంతోపాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ. 10 వేలు చెల్లించాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News