Bihar: ఈ నెల 5న రాత్రి 8 గంటలకు మా అమ్మ చనిపోతారు.. సెలవు ఇవ్వండి: ఉపాధ్యాయుడి సెలవు చీటీ

my mother will die on 5th need leave bihar teachers strange application letter goes viral
  • బీహార్ టీచర్ల వింత లీవ్ లెటర్లు
  • తనకు కడుపు నొప్పి వస్తుంది కాబట్టి సెలవు కావాలన్న మరో టీచర్
  • త్వరలో తన ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి సెలవు కోరిన ఇంకో ఉపాధ్యాయుడు
  • వాటిని చూసి విస్తుపోయిన అధికారులు
‘ఈ నెల 5న రాత్రి 8 గంటలకు మా అమ్మ చనిపోతారు. కాబట్టి అంత్యక్రియల కోసం 6, 7వ తేదీల్లో సెలవులు కావాలి’..
‘త్వరలోనే నా ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి 4, 5 తేదీల్లో సెలవు ఇప్పించండి’..
‘నేను ఓ పెళ్లికి వెళ్లాలి. అక్కడ బాగా తినేస్తాను కాబట్టి కడుపు నొప్పి వస్తుంది. కాబట్టి ఏడో తేదీన నాకు సెలవు ఇవ్వండి’ అంటూ లీవ్ లెటర్లు రాశారు. 

వీటిని చూస్తే మీకేమనిపిస్తుంది? పిల్లలు సెలవుల కోసం తెలిసీ తెలియని తనంతో ఇలా రాసి ఉంటారని అనిపిస్తోంది కదూ! అయితే, మీరు పొరబడినట్టే. ఈ లీవ్ లెటర్లు రాసింది విద్యార్థులు కాదు. వారికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు. ఈ వింత లీవ్‌ లెటర్ల విషయం వెలుగులోకి రావడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. 

సెలవు చీటీలు ఇలా కూడా రాస్తారా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ.. బీహార్‌లో. సెలవు పెట్టడానికి ముందే దరఖాస్తు చేసుకోవాలంటూ భాగల్‌పూర్ కమిషనర్ దయానిధన్ పాండే ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ వింత లీవ్ లెటర్లు పుట్టుకొచ్చాయి. 

తన తల్లి చనిపోబోతోందని బాంకా జిల్లా కచారి పిప్రా గ్రామానికి చెందిన అజయ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు లీవ్‌కు దరఖాస్తు చేసుకుంటే, బరాహత్‌లోని ఖాదియారా ఉర్దూ విద్యాలయ ఉపాధ్యాయుడు రాజ్‌గౌరవ్.. తనకు త్వరలో ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి సెలవు కావాలని లీవ్ అప్లై చేశాడు. కటోరియాకు చెందిన నీరజ్ కుమార్ తాను పెళ్లికి వెళ్తున్నానని, అక్కడ బాగా తింటాను కాబట్టి కడుపు నొప్పి వస్తుందని, బాధతో స్కూలుకు రాలేను కాబట్టి సెలవు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ లీవ్ లెటర్లను చూసి ఉన్నతాధికారులు విస్తుపోయారు.
Bihar
Teachers Leave Letters
Govt Teachers
Viral News

More Telugu News