Bollywood: అసలు ఒప్పుకోని తెలుగు సినిమా నుంచి తనను ఎలా తప్పిస్తారంటున్న బాలీవుడ్ హీరోయిన్

Sonakshi clarifies that she has NOT signed a Telugu project
  • బాలయ్య–అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను తీసుకున్నట్టు ప్రచారం
  • ఎక్కువ డిమాండ్ చేయడంతో వద్దనుకున్నారంటూ మరో వార్త
  • రెండింటినీ ఖండించిన సోనాక్షి సిన్హా
బాలీవుడ్ విలక్షణ నటుడు శత్రఘ్న సిన్హా వారసురాలిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన సోనాక్షి సిన్హా హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆరంభంలోనే సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి బడా హీరోల సరసన నటించింది. పలు భారీ విజయాలు సొంతం చేసుకుంది. కానీ, ఆ తర్వాత వెనుకబడిపోయింది.  దీపిక పదుకొణే, అలియా భట్, కియారా ఆద్వాని, పూజా హెగ్డే వంటి ముద్దుగుమ్మలు వరుస సినిమాలతో దూసుకెళ్తుండగా సోనాక్షికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. వాళ్లతో పోలిస్తే కాస్త బొద్దుగా ఉండటం సోనాక్షికి కాస్త మైనస్ అవుతోంది. అయితే, తను టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నదని ఇటీవల వార్తలు వచ్చాయి. 

నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోయే సినిమాలో సోనాక్షిని హీరోయిన్ గా ఖాయం చేశారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, ఈ ప్రాజెక్టు నుంచి ఆమెను తప్పించారంటూ మళ్లీ కథనాలు వచ్చాయి. ఈ సినిమా కోసం భారీ మొత్తం డిమాండ్ చేయడంతోనే సోనాక్షిని కాదనుకుంటున్నారని పుకార్లు మొదలయ్యాయి. వీటిని అనిల్ రావిపూడి కానీ, చిత్ర బృందం కానీ ధ్రువీకరించలేదు. 

ఈ క్రమంలో ఈ వార్తలపై  సోనాక్షి స్పందించింది. ‘టాలీవుడ్ సినిమాలో నేను నటించబోతున్నట్టు కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చాయి. అవి నిజం కాదు, ఇప్పుడు అదే సినిమా నుంచి తనను తప్పించారంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఒప్పుకోని సినిమా నుంచి హీరోయిన్‌ని ఎవరైనా తీసేస్తారా?’ అని ప్రశ్నించింది . తన టాలీవుడ్ ఎంట్రీ విషయంలో వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని కొట్టిపారేసింది.
Bollywood
Tollywood
Sonakshi Sinha
clarifies
Balakrishna
anil ravipudi
drop

More Telugu News