Sensex: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
- 208 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 58 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 208 పాయింట్లు నష్టపోయి 62,626కి పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 18,642కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (1.42%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.99%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.81%), నెస్లే ఇండియా (0.75%), యాక్సిస్ బ్యాంక్ (0.59%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.50%), డాక్టర్ రెడ్డీస్ (-2.35%), ఇన్ఫోసిస్ (-1.69%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.32%), భారతి ఎయిర్ టెల్ (-1.27%).