CPS: మంత్రుల సంఘం సమావేశానికి ఎస్టీయూ, యూటీఎఫ్ సంఘాల హాజరు

STU and UTF attends Ministers Committee meeting
  • సీపీఎస్ పై సమావేశం ఏర్పాటు చేసిన మంత్రుల సంఘం
  • హాజరైన బొత్స, ఆదిమూలపు, సజ్జల
  • దూరంగా ఉన్న సీపీఎస్ ఉద్యోగ సంఘాలు
మంత్రుల సంఘం ఇవాళ సీపీఎస్ పై సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు హాజరుకాలేదు. ఎస్టీయూ, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు, రెవెన్యూ సేవల ఉద్యోగ సంఘాలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. కాగా, ఈ మంత్రుల సంఘం సమావేశానికి బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. 

ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ దీనిపై స్పందిస్తూ, వేళకు జీతాలు ఇవ్వలేని వారు ఓపీఎస్ అమలు చేస్తారని ఊహించలేమని అన్నారు. తాము ఓపీఎస్ పైనే చర్చిస్తామని స్పష్టం చేశారు. 

ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పందిస్తూ, పెన్షన్ విధానంపై ప్రభుత్వం ఎన్ని తాయిలాలు ప్రకటించినప్పటికీ ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని అన్నారు.
CPS
Misniters Committee
STU
UTF
Andhra Pradesh

More Telugu News