Vijayasai Reddy: రాజ్యసభ వైస్ చైర్మన్ పానెల్ లో విజయసాయిరెడ్డి

Vijayasai appointed as Rajya Sabha vice chairman panel member
  • విజయసాయి సహా 8 మందితో వైస్ చైర్మన్ ప్యానెల్
  • ఆమోద ముద్ర వేసిన రాజ్యసభ చైర్మన్
  • కృతజ్ఞతలు తెలిపిన విజయసాయి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి విశిష్ట గౌరవం దక్కింది. ఆయన రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ కు ఎంపికయ్యారు. ఈ మేరకు భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కడ్ ఆమోదం తెలిపారు. రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గైర్హాజరీలో విజయసాయి ప్యానెల్ వైస్ చైర్మన్ హోదాలో సభా సమావేశాలను నడిపిస్తారు. విజయసాయితో పాటు మరో ఏడుగురికి కూడా వైస్ చైర్మన్ ప్యానెల్ లో అవకాశం ఇచ్చారు. 

తన నియామకంపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ, వైస్ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన రాజ్యసభ చైర్మన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. కాగా, రాజ్యసభ నిర్వహణాధికారుల పేర్లను రాజ్యసభ వెబ్ సైట్లో పొందుపరిచారు.

రాజ్యసభ చైర్మన్- జగదీప్ ధన్ కడ్
డిప్యూటీ చైర్మన్- హరివంశ్

వైస్ చైర్మన్ ప్యానెల్ సభ్యులు

1. విజయసాయిరెడ్డి
2. భుభనేశ్వర్ కలితా
3. వందనా చవాన్
4. సుఖేందు శేఖర్ రే
5. డాక్టర్ ఎల్.హనుమంతయ్య
6. ఇందు బాలా గోస్వామి
7. డాక్టర్ సస్మిత్ పట్రా
8. తిరుచ్చి శివ
Vijayasai Reddy
Rajya Sabha
Vice Chairman
YSRCP
Andhra Pradesh

More Telugu News