Rasamai Balakishan: సీఎం కేసీఆర్ కంటే నేనే ఎక్కువ చదువుకున్నా: రసమయి బాలకిషన్

Studied better Than CM KCR and KTR Says Rasamai Balakishan
  • కరీంనగర్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
  • ఎమ్మెల్యేగా ఉంటూనే డాక్టరేట్ సాధించానన్న రసమయి
  • ఉపాధ్యాయ వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చానన్న ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కంటే తానే ఎక్కువగా చదువుకున్నానని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్, ధర్మారం గ్రామాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను బాలకిషన్ నిన్న ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఉపాధ్యాయ వృత్తి చేపట్టేందుకు అంబేద్కర్ ఆలోచనా విధానమే కారణమన్నారు. ఎంఏ, ఎంఫిల్, బీఎడ్ చదివి ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన తాను గోచి, గొంగడి పెట్టుకుని పాటలు కూడా పాడానని అన్నారు. ఆ తర్వాత ప్రజా సేవ కోసం ఉద్యోగాన్ని వదులుకున్నానని అన్నారు. అంబేద్కర్ మాదిరిగానే తాను కూడా చదువుకుని డాక్టరేట్ సాధించానని, గోల్డ్ మెడల్ అందుకున్నానని బాలకిషన్ అన్నారు.
Rasamai Balakishan
TRS
Dr BR Ambedkar
Manakondur

More Telugu News