Allu Arjun: గూగుల్ టాప్ సాంగ్స్ లో ‘పుష్ప’ శ్రీవల్లి

Allu Arjun Rashmika Mandanna Srivalli from Pushpa finds a place in Googles Top Songs
  • 10వ స్థానంలో నిలిచిన పాట
  • 2022లో ఈ పాట గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మందిలో ఆరాటం
  • ఈ పాటను ఆలపించింది సిద్ శ్రీరామ్
అల్లు అర్జున్, రష్మిక మందన్న కలయికలో వచ్చిన ‘పుష్ప’ సూపర్ హిట్ అయిన సంగతి విదితమే. ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ ఈ సినిమాకి ఎంతో ప్రచారాన్ని తీసుకొచ్చింది. ఎంతో మంది సెలబ్రిటీలు ఈ డైలాగ్ తో హావభావాలు ప్రదర్శించేందుకు ఇష్టపడేవారు. 2022లో ఈ సినిమా కోసం, సినిమాలో పాటల కోసం నెటిజన్లు గూగుల్ లో తెగ శోధించారు. అలా పుష్ప సినిమాలోని ‘శ్రీవల్లి’ పాట కోసం కూడా ఎక్కువ మంది తెలుసుకునే ప్రయత్నం చేశారు. 2022 సంవత్సరానికి సంబంధించి టాప్ -10 పాటల్లో శ్రీవల్లికి 10వ స్థానం దక్కింది.

పుష్ప సినిమా 2021 డిసెంబర్ లో థియేటర్లలోకి రాగా, ఆ తర్వాత చాలా కాలం పాటు ఈ సినిమాలోని డైలాగ్ లు ఎంతో మంది నోళ్లల్లో నానాయి. శ్రీవల్లి పాటను సిద్ శ్రీరామ్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో ఆలపించారు. హిందీ వెర్షన్ పాటను జావేద్ అలీ పాడారు. పుష్ప సినిమాకు రచన, దర్శకత్వం బాధ్యతలను సుకుమార్ నిర్వహించడం తెలిసిందే. గూగుల్ టాప్ సాంగ్స్ లో అలీ సేతికి సంబంధించి పసూరి మొదటి స్థానంలో, బీటీఎస్ బట్టర్ రెండో స్థానంలో ఉన్నాయి. 

Allu Arjun
Rashmika Mandanna
Pushpa movie
Srivalli song
google top songs

More Telugu News