BCCI: తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త.. రెండు మ్యాచ్ లు కేటాయింపు
- వచ్చే ఏడాది శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సిరీస్ ల వేదికల ఖరారు
- న్యూజిలాండ్ తో వన్డే హైదరాబాద్, ఆస్ట్రేలియాతో వన్డే వైజాగ్ కు కేటాయింపు
- జనవరి నుంచి మార్చి వరకు ఈ సిరీస్ లు
శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు వచ్చే ఏడాది భారత పర్యటనకు రానున్నాయి. తొలుత శ్రీలంక... టీమిండియాతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. న్యూజిలాండ్ కూడా మూడు వన్డేలు, మూడు టీ20ల్లో పోటీ పడనుంది. ఆస్ట్రేలియా మాత్రం నాలుగు టెస్టుల సిరీస్ తో పాటు మూడు వన్డేల్లో భారత్ తో తలపడుంది.
ఈ సిరీస్ లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ గురువారం ఖరారు చేసింది. మ్యాచ్ లు జరిగే తేదీలను, వేదికలను ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, వైజాగ్ లకు అవకాశం దక్కింది. జనవరి 18వ తేదీన న్యూజిలాండ్ తో తొలి వన్డేకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 19వ తేదీన ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు వైజాగ్ ను వేదికగా ఎంపిక చేసిన బీసీసీఐ తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది.
షెడ్యూల్ వివరాలు
శ్రీలంక పర్యటన
తేదీ మ్యాచ్ వేదిక
జనవరి 3 1వ టీ20 ముంబై
జనవరి 5 2వ టీ20 పూణె
జనవరి 7 3వ టీ20 రాజ్ కోట్
జనవరి 10 1వ వన్డే గువాహటి
జనవరి12 2వ వన్డే కోల్ కతా
జనవరి 15 3వ వన్డే తిరువనంతపురం
న్యూజిలాండ్ పర్యటన
జనవరి 18 1వ వన్డే హైదరాబాద్
జనవరి 21 2వ వన్డే రాయ్ పూర్
జనవరి 24 3వ వన్డే ఇండోర్
జనవరి 27 1వ టీ20 రాంచీ
జనవరి 29 2వ టీ20 లక్నో
ఫిబ్రవరి1 3వ టీ20 అహ్మదాబాద్
ఆస్ట్రేలియా పర్యటన
ఫిబ్రవరి9–13 1వ టెస్టు నాగ్ పూర్
ఫిబ్రవరి 17–21 2వ టెస్టు ఢిల్లీ
మార్చి 1–5 3వ టెస్టు ధర్మశాల
మార్చి 9–13 4వ టెస్టు అహ్మదాబాద్
మార్చి 17 1వ వన్డే ముంబై
మార్చి 19 2వ వన్డే వైజాగ్
మార్చి 22 3వ వన్డే చెన్నై