Vangalapudi Anitha: మీ అసమర్థ పాలనలో ఇంకెంతమంది మహిళలు బలికావాలి?: టీడీపీ నాయకురాలు అనిత 

TDP leader Anitha take a jibe at CM Jagan over Tapasvi incident
  • ప్రేమోన్మాది ఘాతుకానికి తపస్వి బలి
  • సీఎం ఉదాసీనత వల్లే ఉన్మాదులు రెచ్చిపోతున్నారన్న అనిత 
  • చంద్రబాబు వస్తేనే మహిళలకు భద్రత అని వ్యాఖ్య  
రాష్ట్రంలో రోజుకో ప్రేమోన్మాది యువతుల ప్రాణం తీస్తున్నా.. సీఎంకి చీమకుట్టినట్టు కూడా లేదని టీడీపీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి ఉదాసీనత వల్లే రాష్ట్రంలో ఉన్మాదులు రెచ్చిపోతున్నారని విమర్శించారు. డాక్టర్ అయ్యి పేదలకు వైద్యం అందించాలని ఎన్నో కలలు కన్న వైద్య విద్యార్దిని తపస్విని జగన్ రెడ్డి పాలనలో ఓ ఉన్మాది చేతిలో బలైందని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. 

"వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో మహిళలపై అఘాయిత్యాలు నితృకృత్యమయ్యాయి. మొన్న రమ్య, నిన్న తపస్విని... రేపు ఎవరో? జగన్ రెడ్డీ... మీ అసమర్ద పాలనలో ఇంకెంతమంది మహిళలు బలికావాలి? జగన్ రెడ్డి పోలీసు వ్యవస్ధను దుర్వినియోగం చేయటం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితికి కారణం. వైసీపీ పాలనలో పోలీసులు శాంతి భద్రతలు కాపాడటంలో ఫెయిలైనా... ప్రతిపక్షనేతల్ని కట్టడి చేయటం, అక్రమ కేసులతో వేధించటంలో మాత్రం సక్సెస్ అయ్యారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో మహిళలకు భద్రత, రక్షణ" అని అనిత స్పష్టం చేశారు.
Vangalapudi Anitha
Tapasvi
Jagan
TDP
Chandrababu
YSRCP
Andhra Pradesh

More Telugu News