Naga Chaitanya: నాగ చైతన్య క్లౌడ్ కిచెన్ చూశారా..? ఇదిగో వీడియో!
- మాదాపూర్ కేంద్రంగా ‘షోయు’ పేరుతో క్లౌడ్ కిచెన్
- స్విగ్గీ, జొమాటో ద్వారా నగరవాసులకు డెలివరీ
- వీడియో వ్లాగ్ చేసిన దగ్గుబాటి ఆశ్రిత
అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని నాగచైతన్య క్లౌడ్ కిచెన్ వ్యాపారం చేస్తున్నాడని వినే ఉంటారు. ఈ క్లౌడ్ కిచెన్ విశేషాలను నాగ చైతన్య మరదలు, విక్టరీ వెంకటేశ్ కుమార్తె దగ్గుబాటి ఆశ్రిత వీడియో వ్లాగ్ రూపంలో అభిమానులకు పరిచయం చేశారు.
క్లౌడ్ కిచెన్ అంటే కొందరికి ఏంటిది? అన్న సందేహం రావచ్చు. ఇప్పుడు జోరుగా వ్యాపారం చేస్తున్న వంట శాలలు అని చెప్పుకోవాలి. స్విగ్గీ, జొమాటోలో మనం ఆర్డర్ చేసే ఫుడ్స్ రెస్టా రెంట్ నుంచి వస్తాయని తెలుసుగా. అయితే అన్నీ రెస్టారెంట్లే ఉండవు. రెస్టారెంట్ పేరుతో వందలాది క్లౌడ్ కిచెన్లు ప్రతి నగరంలోనూ వెలుస్తున్నాయి. ఇవి స్విగ్గీ, జొమాటోలో నమోదు చేసుకుని, యూజర్ల నుంచి ఆర్డర్ రాగానే ఆహారం రెడీ చేసి డెలివరీకి పంపిస్తుంటాయి. ఇప్పుడు నాగ చైతన్య కూడా ఇలాంటి క్లౌడ్ కిచెన్ వ్యాపారం పెట్టి, రుచికరమైన జపనీస్ వంటకాలను హైదరాబాదీలకు అందిస్తున్నారు.
నాగచైతన్య క్లౌడ్ కిచెన్ పేరు ‘షోయు’. దీన్ని మాదాపూర్ లో తెరిచారు. జపాన్, ఇతర ఆసియా దేశాల డిషెస్ ను అందించడం దీని ప్రత్యేకత. ఈ స్టార్టప్ ఐడియా రావడానికి నేపథ్యం, ఇతర విశేషాలను ఈ వీడియోలో నాగచైతన్య వివరించాడు.