Mahesh Babu: జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమా

Mahesh Babu movie with Trivikram will go on sets from January
  • మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో భారీ చిత్రం
  • హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చిత్రం
  • జనవరి నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు 28వ చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న ఈ భారీ చిత్రం జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. షూటింగ్ కు సర్వం సిద్ధమైందని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. 

మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకోనుందని తెలిపింది. అభిమానులతో మరిన్ని సూపర్ ఎగ్జయిటింగ్ అప్ డేట్లను పంచుకుంటామని హారిక హాసిని క్రియేషన్స్ తెలిపింది. కాగా, ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Mahesh Babu
Trivikram Srinivas
SSMB28
Tollywood

More Telugu News