Shoaib Malik: సానియా మీర్జాతో విడాకులు అంటూ ప్రచారం... స్పందించిన షోయబ్ మాలిక్

Shoaib Malik reacts to speculations that he and Sania Mirza being divorced
  • 2010లో పెళ్లి చేసుకున్న సానియా, షోయబ్
  • విడాకులు అంటూ ఇటీవల ప్రచారం
  • ఇది పూర్తిగా వ్యక్తిగత విషయమన్న మాలిక్
  • ఈ విషయం ఇంతటితో వదిలేయాలని విజ్ఞప్తి
భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా 2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి ఇషాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు. కాగా, ఈ జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమైందని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. 

ఈ ప్రచారంపై షోయబ్ మాలిక్ పెదవి విప్పాడు. ఇది పూర్తిగా తమ వ్యక్తిగత వ్యవహారం అని స్పష్టం చేశాడు. విడాకుల అంశంపై తాను గానీ, తన భార్య సానియా మీర్జా కానీ ఇంతకుమించి ఎలాంటి సమాధానం చెప్పబోమని తెలిపాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని షోయబ్ మాలిక్ పేర్కొన్నాడు. 

కాగా, పాకిస్థాన్ నటి ఆయేషా ఒమర్ తో షోయబ్ మాలిక్ సన్నిహితంగా ఉండడం వల్లే వీరి కాపురంలో కలతలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. వీరి సన్నిహిత వర్గాలు కూడా ఎప్పుడో విడాకులు వచ్చేశాయని చెబుతున్నారు. అటు, సోషల్ మీడియాలో సానియా మీర్జా పెడుతున్న కొన్ని పోస్టులు కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేవిగా ఉంటున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సానియా, షోయబ్ దీనిపై ప్రకటన చేస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం కనిపించడంలేదు.
Shoaib Malik
Sania Mirza
Pakistan
India
Cricket
Tennis

More Telugu News