HIT2: 9 రోజుల్లోనే బ్రేక్​ ఈవెన్​ సాధించి లాభాల్లోకి వచ్చేసిన హిట్2

HIT 2 Movie Box office Collections
  • అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్
  • ఈ నెల 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల
  • రూ. 14.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం
అడివి శేష్ నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ చిత్రం హిట్2 ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నెల 2వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సానుకూల స్పందన వచ్చింది. శైలేష్ కొలను రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం  మంచి వసూళ్లు కూడా రాబడుతోంది. ఈ చిత్రం రూ. 14.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. తొమ్మిది రోజుల్లోనే  బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పటికే 19.62 కోట్లు రాబట్టింది. దాంతో, ఇప్పటికే దాదాపు 4.15 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. 

ఆంధ్ర, తెలంగాణలో రూ. 13.32 కోట్లు రాబట్టింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ లో మరో ఆరు కోట్లు లభించాయి. మొత్తంగా ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 35.75 కోట్ల గ్రాస్ సాధించింది. ఓటీటీ, శాటిలైట్స్ హక్కుల్లోనూ ఈ చిత్రం మంచి బిజినెస్ చేసింది. అన్నీ కలిపితే హిట్2 దాదాపు రెట్టింపు లాభాలను సాధించేలా ఉంది.  నేచురల్ స్టార్ నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్‌ కథానాయికలుగా నటించారు.
HIT2
Box office collections
break even
adivi shesh
Nani

More Telugu News