BRS: ఈ నెల 14న ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం

BRS Party office will open on December 14
  • జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్
  • టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్పు
  • ఢిల్లీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాల నేతలు
  • ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి వేముల, ఎంపీ సంతోష్
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచనతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీనే బీఆర్ఎస్ గా మార్చారు. 

ఈ నేపథ్యంలో, దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఈ నెల 14న ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో సీఎం కేసీఆర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఇక్కడ రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. 

కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ లు నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. ఓ వాస్తు నిపుణుడితో కలిసి యాగశాల స్థలం పరిశీలించారు. 

మరికొందరు పార్టీ నేతలు నేడు, రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా, బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా హాజరుకానున్నట్టు తెలుస్తోంది.
BRS
Party Office
New Delhi
CM KCR
Telangana
TRS

More Telugu News