Kalvakuntla Kavitha: కవిత నివాసంలో ముగిసిన సీబీఐ విచారణ

CBI questioning concludes in Kavitha residence
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై విచారణ
  • హైదరాబాదులోని కవిత నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులు
  • ఏడున్నర గంటల పాటు ప్రశ్నించిన వైనం
  • సాక్షిగా కవితను విచారించిన సీబీఐ అధికారులు
ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు నేడు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ప్రశ్నించారు. హైదరాబాదులోని కవిత నివాసంలో కొద్దిసేపటి కిందట విచారణ ముగిసింది. ఈ ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను ప్రశ్నించిన సీబీఐ బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది. లిక్కర్ స్కాంలో సాక్షిగా కవిత వాంగ్మూలం నమోదు చేసింది.

నేటి విచారణలో ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం పాల్గొంది. లిక్కర్ స్కాం నిందితుడు అమిత్ అరోరా వాంగ్మూలం ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కాగా, 170 సెల్ ఫోన్లు ధ్వంసం చేశారన్న ఆరోపణలపైనా సీబీఐ అధికారలు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కవిత గతంలో వాడిన సెల్ ఫోన్ల వివరాలపై సీబీఐ అధికారులు ఆరా తీశారు.
Kalvakuntla Kavitha
CBI
Delhi Liquor Scam
Hyderabad
TRS
BRS
Telangana

More Telugu News