ttd: నేటి మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

TTD announced that Tirumala Arjita Seva tickets will be released from 3 pm on Monday

  • జనవరి నెల కోటాపై టీటీడీ అధికారిక ప్రకటన
  • ఈ నెల 16, 31వ తేదీలలో రూ.300 దర్శనం టికెట్ల విడుదల రేపు
  • ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవల రద్దు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ నెల కోటాకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను సోమవారం (ఈరోజు) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చని సూచించింది. అదేవిధంగా ఈ నెల 16, 31 తేదీలకు సంబంధించి ప్రత్యేక రూ.300 దర్శనం టైం స్లాట్ ను మంగళవారం(రేపు) విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఈ టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. 

ఈ నెల 16వ తేదీ సాయంత్రం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుండడంతో మరుసటి రోజు.. అంటే 17వ తేదీ నుంచి జనవరి 14 వ తేదీ వరకు శ్రీవారి సుప్రభాత సేవలను టీటీడీ రద్దు చేసింది. మరోవైపు, ఆర్జిత సేవా టికెట్లతో పాటు కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను కూడా విడుదల చేయనున్నట్లు అధికారులు చెప్పారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ, పాద పద్మారాధన సేవా టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News