Honda: భారత్ లో రెండు కొత్త స్కూటర్లకు పేటెంట్లు తీసుకున్న హోండా

Honda Patents A 125 CC Scooter  A 150 CC Scooter In India

  • విన్నర్ ఎక్స్, 125 ఎల్ఏ పేరుతో పేటెంట్లకు దరఖాస్తు
  • పేటెంట్ మంజూరు తర్వాత విడుదలకు అవకాశం
  • రెట్రో థీమ్ తో ఉండనున్న విన్నర్ ఎక్స్

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రెండు స్కూటర్లకు సంబంధించి డిజైన్ పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంది. పేటెంట్లు మంజూరైతే భారత్ లో మరే ఇతర సంస్థ హోండా స్కూటర్ల డిజైన్లను కాపీ చేయడానికి ఉండదు. ఎన్ 125 ఎల్ఏ, విన్నర్ ఎక్స్ పేరుతో పేటెంట్ల కోసం హోండా దరఖాస్తు పెట్టుకుంది.

ఇందులో విన్నర్ ఎక్స్ డిజైన్ అయితే.. సుజుకీ యాక్సెస్ 125 సీసీ, యమహా ఫ్యాసినో లకు గట్టి పోటీనిచ్చేలా ఉంది. ఇక హోండా ఎన్ఎస్ 125 ఎల్ఏ రెట్రో థీమ్ స్కూటర్ మాదిరి కనిపిస్తుంది. హెడ్ ల్యాంప్ గుండ్రంగా ఉంటుంది. ఒక విధంగా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్, వెస్పా డిజైన్ మాదిరి పోలికలతో ఉంటుంది. బ్లాక్ అలాయ్ వీల్స్, ఎగ్జాస్ట్ పై క్రోమ్ ఫినిషింగ్ గమనించొచ్చు. 

హోండా ఎన్ఎస్ 125 ఎల్ ఏ స్కూటర్ 124 సీసీ ఇంజన్ తో ఉంటుంది. గరిష్ఠంగా 8.9 బీహెచ్ పీ పవర్, 9.8 ఎన్ఎం టార్క్ అవుట్ పుట్ తో ఉంటుంది. యూఎస్ బీ చార్జింగ్, కీలెస్ నేవిగేషన్ ఫీచర్లు ఉన్నాయి. విన్నర్ ఎక్స్ స్కూటర్ యమహా ఏరాక్స్ 155కు పోటీ ఇవ్వనుంది. ఇందులో 150సీసీ ఇంజన్ ఉంటుంది. యమహా ఏరాక్స్ కంటే విన్నర్ఎక్స్ అధిక పవర్ ను విడుదల చేస్తుంది. 17 అంగుళాల అలాయ్ వీల్ సహా ఎన్నో ఫీచర్లతో ఉంటుంది.

  • Loading...

More Telugu News