Inland Taipan: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము ఇదేనట!

Inland Taipan termed as most venomous snake in the world

  • ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్లాండ్ తైపాన్ పాము 
  • ఒక్క కాటుతో 110 మిల్లీగ్రాముల విషం విడుదల
  • ఆ విషానికి 100 మందిని చంపే సామర్థ్యం
  • చాలా అరుదుగా కనిపించే పాము

భారతదేశంలో విష సర్పాలు అంటే నాగుపాము, రక్తపింజరి, కట్లపాము, కింగ్ కోబ్రాల పేర్లు చెబుతారు. అయితే వీటన్నింటిని మించిన విషసర్పం ఆస్ట్రేలియాలో ఉంటుంది. దాని పేరు ఇన్లాండ్ తైపాన్. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము. 

ఇది ఒక్క కాటుతో 110 మిల్లీగ్రాముల విషాన్ని విడుదల చేస్తుందట. దాంతో 100 మంది వ్యక్తులను, లేదా 2.50 లక్షల ఎలుకలను చంపవచ్చని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. 

అయితే ఈ ప్రమాదకర పాములు ఆస్ట్రేలియాలో తప్ప మరెక్కడా కనిపించవు. అది కూడా మారుమూల అటవీప్రాంతాల్లోనే సంచరిస్తుంటాయి. పగటిపూట ఇవి కనిపించడం చాలా తక్కువ అని పరిశోధకులు తెలిపారు. ఇన్లాండ్ తైపాన్ పాము సగటున 1.8 మీటర్ల పొడవు పెరుగుతుంది. వీటి కోరలు 3.5 నుంచి 6.2 మిమీ పొడవు ఉంటాయి. 

ఇన్లాండ్ తైపాన్ పాములు ఋతువులను అనుసరించి చర్మం రంగును మార్చుకుంటాయి. చలికాలంలో ముదురు గోధుమ రంగులోనూ, వేసవిలో లేత గోధుమ రంగులోనూ కనిపిస్తాయి. ఎలుకలు, కోడిపిల్లలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి.

  • Loading...

More Telugu News