Bay Of Bengal: వదలని అల్పపీడనాలు.. బంగాళాఖాతంలో మరోటి!

another low pressure over bay of bengal

  • ఏపీ, తెలంగాణలో ఇంకా కనిపిస్తున్న తుపాను ప్రభావం
  • నేడు మరింత బలపడనున్న అల్పపీడనం
  • వారాంతంలో మరోటి ఏర్పడే అవకాశం

మాండౌస్ తుపాను తీరం దాటి బలహీనపడినప్పటికీ ఆ ప్రభావం ఇంకా ఏపీ, తెలంగాణలో కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇప్పుడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. 

తుపాను పరిస్థితుల కారణంగా ఆగ్నేయ అరేబియా సముద్రంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా మారనున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. అంతేకాదు, ఇది మరింత బలపడి రేపటికి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

దీనికితోడు బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో సుమిత్ర జలసంధిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రెండుమూడు రోజుల్లో ఇది పశ్చిమంగా పయనించి శ్రీలంకకు సమీపంలో ఈ వారాంతంలో అల్పపీడనంగా మారొచ్చని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News