Bandi Sanjay: తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయింది: బండి సంజయ్

TRS is finished in Telangana says Bandi Sanjay
  • తమ పోరాటానికి టీఆర్ఎస్ పారిపోయిందన్న సంజయ్
  • బీఆర్ఎస్ వైరస్ కు బీజేపీనే వ్యాక్సిన్ అని వ్యాఖ్య
  • సొంత ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపణ
బీజేపీ పోరాటానికి టీఆర్ఎస్ పారిపోయిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పారు. తన పాదయాత్రలో బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లు కట్టడంపై మండిపడ్డారు. తాము బ్యానర్లను కడితే టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేరని అన్నారు.

బీఆర్ఎస్ వైరస్ కు బీజేపీనే వ్యాక్సిన్ అని చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. డ్రగ్ కేసును రీఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను తిరగతోడతామని అన్నారు. అన్ని కేసులను మధ్యలోనే వదిలేస్తున్నారని... నిందితుల స్టేట్మెంట్లను రహస్యంగా రికార్డ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఎంపీగా రాష్ట్రానికి ఏం చేయాలో అంతా చేస్తున్నానని చెప్పారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని టీఆర్ఎస్ శ్రేణులను హెచ్చరించారు.
Bandi Sanjay
BJP
KCR
TRS
BRS

More Telugu News