BRS: ట్విట్టర్ లో ఇక 'టీఆర్ఎస్' కనిపించదు!
- జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్
- బీఆర్ఎస్ పార్టీ ప్రకటన
- టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతున్నట్టు వెల్లడి
- తాజాగా ట్విట్టర్ హ్యాండిల్ పేరు మార్పు
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆశయంతో బీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. ఇప్పటివరకు ఉన్న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుతున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పేరు తెరమరుగు కాగా, సోషల్ మీడియాలోనూ బీఆర్ఎస్ పార్టీగానే దర్శనమివ్వనుంది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మారిందని, ఈ సందర్భంగా@trspartyonline గా ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ పేరును @BRSparty గా మార్చినట్టు వెల్లడించింది. ట్విట్టర్ లో ఇక టీఆర్ఎస్ కనిపించదని, ఈ మార్పును బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గమనించాలని పేర్కొంది.