multi year: హెల్త్ ప్లాన్ ఏడాదికా.. మూడేళ్లకా..?

Reasons why you should upgrade to a multi year health insurance policy

  • మూడేళ్లకు తీసుకోవడం వల్ల పలు ప్రయోజనాలు
  • ప్రీమియంలో 15 శాతం వరకు ఆదా
  • ఏటా రెన్యువల్ సమస్య ఉండదు
  • మూడేళ్ల వరకు ఒక్కటే ప్రీమియం

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి వ్యక్తికీ, ప్రతి కుటుంబానికీ ఉండాల్సిందే. లేదంటే ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో డబ్బు సర్దుబాటు చేసుకోలేక అవస్థలు పడాల్సి వస్తుంది. పైగా ఆరోగ్య ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బంది ఎదురవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో నెలవారీ చెల్లింపులకు అవకాశం లేదు. ఏటా ఒకే విడత ప్రీమియం మొత్తం చెల్లించాలి. చాలా వరకు బీమా కంపెనీలు రెండేళ్లు, మూడేళ్ల కాల చెల్లింపులను ఒకేసారి అనుమతిస్తున్నాయి. పైగా రెండు, మూడేళ్లకు తీసుకునే వారికి కొంత డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో ప్రయోజనాలు చూద్దాం..

ఆదా..
ఒక ఏడాది ప్లాన్ తో పోలిస్తే రెండేళ్ల ప్లాన్ లో 10 శాతం వరకు ప్రీమియంను ఆదా చేసుకోవచ్చు. మూడేళ్ల ప్లాన్ పై ప్రీమియం 15 శాతం వరకు తగ్గుతుంది. ఆరోగ్య బీమాను ఇలా జీవితాంతం రెన్యువల్ చేసుకోవచ్చు. 

ఒక్కటే ప్రీమియం
బీమా కంపెనీలు వయసుల వారీ శ్లాబ్ ను అనుసరించి ప్రీమియం రేట్లను అమలు చేస్తుంటాయి. 0-18 ఏళ్లు, 19-30, 31-45, 46-55, 56-60, 60 ప్లస్ ఇలా హెల్త్ బ్రాకెట్లు ఉంటాయి. పాలసీదారు వయసు ఒక బ్రాకెట్ నుంచి మరో బ్రాకెట్ లోకి మారినప్పుడు ప్రీమియం రేట్లను కంపెనీలు పెంచుతాయి. పైగా కరోనా వంటి ఊహించని సంక్షోభాల సమయంలో క్లెయిమ్ లు అధికంగా వచ్చి పడతాయి. ఈ భారాన్ని అధిగమించేందుకు కూడా వయసుతో సంబంధం లేకుండా ఒక విడత ప్రీమియం రేట్లను కంపెనీలు పెంచుతాయి. కనుక ఒకేసారి మూడేళ్లకు ప్రీమియం చెల్లించడం వల్ల ఇలాంటి భారాలను తగ్గించుకోవచ్చు. మూడేళ్లకు ఒక్కటే ప్రీమియం ప్రయోజనం పొందొచ్చు.

ల్యాప్స్ అవ్వదు
ఆరోగ్య బీమా ఎంతో ముఖ్యమైనది. కనుక ఏటా రెన్యువల్ చేసుకోవాల్సిన సమయంలో ఆ పని చేయకపోతే ల్యాప్స్ అవుతుంది. అదే జరిగితే బీమా కవరేజీ కోల్పోవాల్సి వస్తుంది. కనుక మూడేళ్లకు ఒకేసారి తీసుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు. 

ఈఎంఐ
మూడేళ్ల  ప్రీమియం ఒకేసారి కట్టడం అంటే భారం అనిపించొచ్చు. అలాంటి వారికి బీమా సంస్థలు ఈఎంఐ ఆప్షన్ ను క్రెడిట్ కార్డులపై అందిస్తున్నాయి. క్రెడిట్ కార్డుల నుంచి ప్రీమియం మొత్తం ఒకేసారి బీమా సంస్థకు వెళుతుంది. కార్డుదారుడికి నెలవారీ ఈఎంఐల కింద మారుతుంది. దీనివల్ల కొంత వడ్డీ భారం పడుతుంది.

పన్ను ప్రయోజనాలు
మూడేళ్లకు ఒకేసారి ప్రీమియం చెల్లించినప్పటికీ, పన్ను ప్రయోజనాలను ఏటా క్లెయిమ్ చేసుకోవచ్చు. మూడు భాగాలు చేసి, ఒక్కో భాగాన్ని చూపించుకోవాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News