centra: మళ్లీ తెరపైకి జమిలి ఎన్నికలు!

 simultaneous polls will save money says Govt

  • లోక్ సభ, అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికలు మేలంటున్న కేంద్రం
  • జమిలి ఎన్నికలతో ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి
  • రాజ్యసభలో ఎంపీ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన కిరణ్ రిజిజు

జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎన్నికలంటే భారీ వ్యయంతో కూడుకున్న వ్యవహారం అని అభిప్రాయపడింది. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే చాలా మొత్తం ఆదా అవుతుందని పార్లమెంటులో ప్రస్తావించింది. ఈ మేరకు రాజ్యసభలో ఓ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. దాంతో, దేశంలో మరోసారి జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది.

ఎన్నికల సంస్కరణలపై  ఏర్పాటు చేసిన లా కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా జమిలి ఎన్నికలను ప్రస్తావించిందని రిజిజు తెలిపారు. పరిపాలనలో స్థిరత్వం కోసం లోక్ సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించిందని చెప్పారు. ఇలా ఒకేసారి ఎన్నికల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదా అవ్వడంతో పాటు అధికార యంత్రాంగంపై భారం తగ్గుతుందని చెప్పారు. నిత్యం ఏదో ఒకచోట ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సుదీర్ఘంగా అమలు చేయాల్సి వస్తోందన్నారు. దీనివల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావాన్ని జమిలి ఎన్నికలతో నివారించవచ్చని రిజిజు తెలిపారు.

  • Loading...

More Telugu News