Agni-V: అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతం

India succesfully test fires Agni V
  • ఒడిశా తీరం నుంచి దూసుకెళ్లిన మిస్సైల్
  • అగ్ని-5కి అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం
  • 5 వేల కిమీ ఆవల లక్ష్యాలను కూడా ఛేదించే బాలిస్టిక్ మిస్సైల్
  • ఈ క్షిపణి పరిధిలోకి చైనాలోని పలు ప్రాంతాలు
సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక వ్యవస్థలతో అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ భారీ క్షిపణి సాయంత్రం 5.30 గంటలకు గగనతలంలోకి దూసుకెళ్లింది. 

అణ్వస్త్రాన్ని మోసుకుపోగల సామర్థ్యం ఈ బాలిస్టిక్ మిస్సైల్ సొంతం. ఇది 5 వేల కిలోమీటర్లకు ఆవల ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించగలదు. తాజా ప్రయోగం ద్వారా దీని రేంజి పెంపుదల అవకాశాలను, రాత్రివేళల్లో ప్రయాణ సామర్థ్యాన్ని పరీక్షించారు. అనుకున్న మేర ఇది అంచనాలను అందుకుందని రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి. 

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ బాలిస్టిక్ మిస్సైల్ ను పరీక్షించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది చైనా రాజధాని బీజింగ్ ను కూడా తాకగలిగే సామర్థ్యం ఉన్న క్షిపణిగా భావిస్తున్నారు. ఇందులో మూడు దశల ఘన ఇంధన ఇంజిన్ ను వినియోగించారు. లక్ష్యఛేదనలో అగ్ని-5 అత్యంత కచ్చితత్వంతో కూడిన ఫలితాలను ఇస్తోందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
Agni-V
Missile
Test Fire
India
China

More Telugu News