Pawan Kalyan: అన్ స్టాపబుల్-2 టాక్ షోకి పవన్ కల్యాణ్...? హింట్ ఇచ్చిన బాలకృష్ణ

Pawan Kalyan likely comes to Balakrishna Unstoppable 2 talk show along with Trivikram
  • బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్-2
  • తివ్రిక్రమ్ ను ఆహ్వానించిన బాలయ్య
  • ఎవరితో రావాలో తెలుసుగా? అంటూ సస్పెన్స్ లో ఉంచిన బాలయ్య
  • టీజర్ విడుదల చేసిన ఆహా
టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ తన వాక్చాతుర్యంతో అన్ స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ ను కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు. బడా నేతలను, స్టార్లను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ టాక్ షోను రక్తి కట్టిస్తున్నారు. అన్ స్టాపబుల్-2 టాక్ షో ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. 

ఇప్పటికే పలువురు ప్రముఖులతో ఎపిసోడ్లు నిర్వహించిన బాలకృష్ణ లేటెస్ట్ ఎపిసోడ్ కు పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ ను ఆహ్వానించినట్టు సూచనప్రాయంగా వెల్లడైంది. దీనికి సంబంధించిన టీజర్ వీడియోను ఆహా ఓటీటీ విడుదల చేసింది. అందులో బాలయ్య దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఫోన్ చేయడం చూడొచ్చు. 'ఏం త్రివిక్రమ్... అన్ స్టాపబుల్ షోకు ఎప్పుడొస్తున్నావ్?' అని బాలకృష్ణ అడగ్గా... 'మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాను సర్' అంటూ అవతలి నుంచి త్రివిక్రమ్ బదులిచ్చారు. దాంతో బాలయ్య స్పందిస్తూ, 'ఎవరితో రావాలో తెలుసుగా...!' అంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు. 

అయితే అది పవన్ కల్యాణే అని ఈజీగా చెప్పేయొచ్చు. ఎందుకంటే, పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ మంచి స్నేహితులు. అందుకే బాలయ్య వీరిద్దరినీ కలిపి ఇంటర్వ్యూ చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
Pawan Kalyan
Unstoppable-2
Trivikram Srinivas
Balakrishna
Aha
Tollywood

More Telugu News